విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు
NDL: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు డోన్ డిపో మేనేజర్ చలపతి ఇవాళ తెలిపారు. విద్యార్థులు తమ గ్రామాల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఒరిజినల్ హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు.