విగ్రహాల వివాదంపై అధికారుల పరిశీలన
KNR: తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పక్కన బస్టాండ్ ఆవరణలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుపై గత కొంతకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఇవాళ దీనిపై ఆర్టీసీ సీఈ కవిత, ఆర్ఎం రాజు, సీఐ రవీందర్ పరిశీలించారు. ఏప్రిల్ 14న అంబెద్కర్ జయంతి ఉండటంతో అప్పటికైన విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుందో లేదోనని దళిత సంఘాలు అవేదన వ్యక్తం చేస్తున్నాయి.