'IDL చెరువు వద్ద DCP నిమజ్జనాల పరిశీలన'

మేడ్చల్: కూకట్‌పల్లి IDL చెరువు వద్ద గణేశ్ నిమజ్జనాల ఏర్పాట్లను డీసీపీ రతన్ కుమార్ స్వయంగా పరిశీలించారు. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, లైటింగ్, వైద్య సదుపాయాలు వంటి అంశాలను సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుతంగా పూర్తయ్యేలా పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.