నగరపాలక ఉద్యోగులకు కమిషనర్ మెమోలు జారీ

KRNL: నగరపాలక సంస్థలో ఇవాళ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ ఉద్యోగులకు కమిషనర్ పి. విశ్వనాథ్ మెమోలు జారీ చేశారు. మున్సిపల్ షాపులు, షటిల్ కోర్టు, ఇండోర్ స్టేడియం వంటి ఖాళీ ఆస్తులపై వేలం నిర్వహించడంలో రెవెన్యూ విభాగం స్పందించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.