పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతులు
ASF: జిల్లాలో ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో 23 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి ఏరడం మొదలైంది. పత్తి పంట చేతికొస్తుండగా సీసీఐ కొనుగోళ్లు మాత్రం ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.