నారాయణస్వామికి ప్రత్యేక పూజలు

నారాయణస్వామికి ప్రత్యేక పూజలు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నారాయణస్వామికి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో పొంగళ్ళు పెట్టి మొక్కులను తీర్చుకున్నారు.