స్టాలిన్ ఆస్తుల వివరాలు

స్టాలిన్ ఆస్తుల వివరాలు

తమిళనాడు సీఎం స్టాలిన్ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. తమ మొత్తం ఆస్తుల విలువ రూ.6.26 కోట్లు ఉంటుందని తెలిపారు. వీటిలో చరాస్తుల విలువ రూ.3.30 కోట్లని, స్థిరాస్తుల విలువ రూ.2.96 కోట్లని పేర్కొన్నారు. ఇందులో స్వయంగా సంపాదించినవి రూ.2.70 కోట్లని, వారసత్వంగా వచ్చిన ఆస్తులు రూ.25.98 లక్షలని వివరించారు. తన భార్య ఆస్తి రూ.3.43 కోట్లు ఉంటుందని చెప్పారు.