రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
SRPT: ద్విచక్ర వాహనం పై నుంచి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు కోదాడ నుంచి నేలకొండపల్లికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా..శాంతినగర్ గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.