బీసీ హాస్టల్‌ను సందర్శించిన బీజేపీ నేతలు

గుంటూరు: చిలకలూరిపేట పట్టణంలోని బీసీ హాస్టల్‌ను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్ సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.