కొమరోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కొమరోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: కొమరోలు మండలంలోని తాటిచెర్ల మోటు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మతుల కారణంగా ముత్రాసు పల్లి, హసనాపురం గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.