గౌతమ్ రెడ్డి కారు తగలబెట్టిన వ్యక్తి ఇతనే
NTR: వైసీపీ రాష్ట్ర నేత గౌతమ్ రెడ్డి కారు గత నెలలో తగలబెట్టిన విషయం తెలిసినదే. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, పేజ్జానపేట చెందిన లెనిన్ బాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. గతంలో గౌతమ్ రెడ్డి వంగవీటి మోహన్‌రంగాపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా కార్ తగలబెట్టినట్లు లెనిన్ బాబు చెప్పాడన్నారు.