చిన్నారిపై లైంగికదాడి.. నిందితుడికి పదేళ్ల శిక్ష

NLR: ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి కేసులో బుచ్చి మండలం రాఘవరెడ్డి కాలనీకి చెందిన గంగపట్నం కుమార్ అనే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది. రూ. 25 వేల జరిమానా కూడా విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ పనికి వెళ్లే సమయంలో తన కుమారైను పకింట్లో వదిలి వెళ్లింది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి చేశాడు.