'డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలి'
SRPT: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని కోదాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నయీం, మాజీ సర్పంచ్ సత్య బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ మునిసిపల్ మాజీ కౌన్సిలర్ మేధర లలితతో పాటు పలువురు పాల్గొన్నారు.