విద్య వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: గుత్తా

విద్య వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: గుత్తా

నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం NLG క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. వైద్య రంగానికి ప్రభుత్వం ప్రతి ఏటా దాదాపు రూ.1200 కోట్ల ఖర్చు చేస్తుందని, HYDలోని నిమ్స్ మాదిరిగా రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లోని హాస్పిటల్స్‌ను బలోపేతం చేయాలన్నారు.