మల్లారంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

మల్లారంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

HNK: మల్లారంలో బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా సర్పంచ్ కల్పనా తిరుపతిరెడ్డి ఉండగా టీచర్లు ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీస్, రెవెన్యూ అధికారులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ రద్దు, పిల్లల రక్షణకు కమిటీ చర్యలు తీసుకుంటుందని సర్పంచ్ తెలిపారు.