పలు ప్రాంతాల్లో నేడు కరెంటు కట్

పలు ప్రాంతాల్లో నేడు కరెంటు కట్

JGL: గొల్లపల్లి మండలం మల్లన్న పేట 33/11 కేవీ సబ్ స్టేషన్ మెయింటెనెన్స్, మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ రాజేష్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలో మల్లన్న పేట, శంకర్రావుపేట, వెంగళాపూర్, నందిపల్లి, ఐబి నగర్, బిబి రాజ్ పల్లి గ్రామాల్లో కరెంట్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.