VIDEO: 'అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలి'
SKLM: అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖ తదితర శాఖలకు సంబంధించి 117 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.