తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి స్వామి దర్శనం కోసం 18 గంటల సమయం పడుతుండగా.. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,855 మంది భక్తులు దర్శించుకోగా.. 26,690 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.82 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు తెలిపారు.