కార్యకర్త మృతికి నివాళులర్పించిన మంత్రి
సత్యసాయి: రొద్దం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త తలారి హనుమంతప్ప శనివారం ఆకస్మిక మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత గ్రామానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి, పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.