మోపాడు రిజర్వాయర్‌కు ఆధునీకరణ
ప్రకాశం: పామూరు(M) మోపాడు రిజర్వాయర్‌ను మంగళవారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంతి బాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రిజర్వాయర్ ఆధునీకరణ పనులు తక్షణం ప్రారంభించాలని కోరారు. రైతులు పంట సాగు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా తూము వద్ద చెట్లను తొలగించాలని సూచించారు. అలాగే కట్టపై గోడలు దెబ్బతినడంతో అవి పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని అధికారులను కోరారు.