కౌఠ (బి) ఆరోగ్య పాఠశాల ను సందర్శించిన ఎంపీడీవో

కౌఠ (బి) ఆరోగ్య పాఠశాల ను సందర్శించిన ఎంపీడీవో

ADB: బోథ్ మండలంలోని కౌఠ (బి) గ్రామంలోని ఆరోగ్య పాఠశాలను MPDO రమేష్ ఇవాళ సందర్శించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమం కింద న్యూట్రి గార్డెన్ అలాగే మన బడి - మన నీరు కార్యక్రమం కింద సాముహిక ఇంకుడు గుంత ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి షకీల్‌కు సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఎంపీడీవోతో పాటు ఈసీ మధుకర్ పాల్గొన్నారు.