'పెన్నా పొర్లుకట్ట నిర్మాణాన్ని పూర్తిచేస్తాం'
NLR: రూరల్ నియోజకవర్గ పరిధిలో పొట్టేపాళెంలో పెన్నా పొర్లుకట్టను టీడీపీ నేత గిరిధర్ రెడ్డి పరిశీలించారు. భారీ తుఫాను వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా పొర్లుకట్టను ఎత్తు పెంచామన్నారు. మొన్న భారీ తుఫాను వచ్చినా ప్రజలకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అందరం కలసికట్టుగా పనిచేశామని వివరించారు. బలహీనంగా ఉన్న పొర్లుకట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలి.