సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
AKP: మాడుగుల మండలం కేజే.పురంలో శ్రీమోదమాంబ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గ్రామంలో ఉన్న 70 మంది ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద రూ.15వేలు నగదు నగదు జమ కావడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆటో యూనియన్ సభ్యులు తెలిపారు.