'గోవు సంరక్షణ ప్రజలందరి బాధ్యత'

'గోవు సంరక్షణ ప్రజలందరి బాధ్యత'

BHPL: భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామ సమీప గోశాలలో గురువారం గోవు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో కోడె లేగలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గోవు సంరక్షణ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు హాజరై, పలు గ్రామాల ప్రజలకు కోడెలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోవు సంరక్షణ ప్రజలందరి బాధ్యతని ఆయన అన్నారు. కార్యక్రమంలో గోవు సంరక్షణ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.