'ధాన్యపు కొనుగోళ్ళను వేగవంతం చేయాలి'
KMR: లింగంపేట్ వరి ధాన్యపు కొనుగోళ్ళను వేగవంతం చేయాలని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం మండలంలోని అయ్యవారు వల్లి గ్రామంలో, ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలులో జాప్యం చేయకుండా వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట మండల అధికారులు, సొసైటీ సిబ్బంది ఉన్నారు.