రెజ్లింగ్‌లో బంగారు పతకాలు సాధించిన అక్కాచెల్లెలు
KKD: విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో వేట్లపాలెం హైస్కూల్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు సుధీష్ణ, హరికశ్రీలు బంగారు పతకాలు సాధించి సత్తా చాటారు. దీంతో వారు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయిలో పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని గ్రామస్తులు, పలువురు ఆకాంక్షించారు.