నేడు బొబ్బిలిలో పవర్ కట్

VZM: బొబ్బిలి మండలంలోని కలవరాయి, జగన్నాథపురం, పెంట సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ రఘు తెలిపారు. బొబ్బిలి 132/33 కేవీ నుంచి కలవరాయి ఫీడర్ లైన్ మరమ్మతుల కోసం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.