మెట్రో ఫేజ్ -2కు లైన్ క్లియర్
HYD: MGBS-దారుల్షిఫా నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో అలైన్‌మెంట్‌కు అడ్డంగా ఉన్న 84 భారీ చెట్లను మరో చోటికి మార్చేందుకు ట్రాన్స్ లొకేట్ HAML టెండర్లు పిలిచింది. రూ 15.64 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌లో కీలక అడ్డంకులను తొలగించి, పనులు వేగవంతం చేయడానికి ఉపయోగపడనుంది.