VIDEO: LPG గ్యాస్ కొరత వార్తలు నమ్మొద్దు: జేసీ
KKD: LPG గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని జేసీ అపూర్వ భరత్, DSO రాజు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 45 మంది డీలర్ల వద్ద సరిపడా సిలిండర్లు ఉన్నాయన్నారు. రోజుకు 11 వేల సిలిండర్లు అవసరమైతే, 14,756 నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.