నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

మహబుబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని టీడీ గుట్ట నుంచి కొత్తచెరువు రోడ్డు వరకు 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలో కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్‌లో కూడా నూతన సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు.