తెగిన విద్యుత్ లైన్.. రెండు గేదెలు మృతి
KDP: వల్లూరు మండలం భాకరాపురంలో గురువారం రాత్రి కురిసిన గాలి, వాన కారణంగా పంట పొలాల్లో విద్యుత్ లైన్ తెగింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు గేదెలను మేతకు తీసుకెళ్లినప్పుడు తెగిన విద్యుత్ లైన్ తగిలి రెండూ అక్కడికక్కడే మృతి చెందాయి. యజమాని టీ.నాగేశ్వర్ రెడ్డి ప్రభుత్వం తరుఫున సహాయం చేయాలని కోరారు.