పెద్దపంజాణి చేరుకున్న కృష్ణా జలాలు

CTR: హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు శుక్రవారం రాత్రి పెద్దపంజాణి మండలం అప్పినపల్లి వద్దకు చేరుకున్నాయి. శనివారం ఉదయం బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం వద్దకు చేరుకున్నాయి. ఈ నెల 30వ తేదీకల్లా కుప్పం చేరుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలను అదే రోజు కుప్పం ప్రజలకు అంకితమివ్వనున్నారు.