ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన

ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన

ELR: చాట్రాయిలో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లకు పోలీసులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఎస్ఐ డీ రామకృష్ణ మాట్లాడుతూ మితిమీరిన వేగంతో ట్రాక్టర్లను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనారిటీ తీరని చిన్నారులకు ట్రాక్టర్లను ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. విపరీత ధోరణిలో హారన్ వినియోగించకూడదని తెలిపారు. సర్టిఫికెట్స్ వెంట ఉండాలన్నారు.