USAలో పట్టణ జనాభా వృద్ధిరేటు డౌన్
అమెరికాలో పట్టణ జనాభా వృద్ధిరేటు పడిపోయింది. 2024లో మెట్రో ప్రాంతాల్లో వృద్ధిరేటు 1.1 శాతం ఉండగా 2025లో 0.6 శాతంగా ఉంది. ఈ మేరకు అమెరికా సెన్సెస్ బ్యూరో జనాభా అంచనాలను విడుదల చేసింది. అయితే, వృద్ధి రేటు తగ్గడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపడంతో భారీగా వలసలు ఆగిపోయాయి.