'గ్రామాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలపై దృష్టి సారించాలి'
కృష్ణా: కాకినాడలో ఇటీవల బాణాసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొవ్వ మండలంలో బాణాసంచా తయారీ కేంద్రాలు, గోదాములు ఉన్నాయేమో ఆరాతీసి వివరాలు సత్వరమే అందజేయాలని తహసీల్దార్ మస్తాన్ అధికారులును ఆదేశించారు. మొవ్వ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు, పోలీసు అధికారులతో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.