రోజూ భోజనం తర్వాత ఇలా నడిస్తే?
భోజనం చేసిన వెంటనే కూర్చోవడం, పడుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కానీ, భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. నడక వల్ల కండరాలు కదలి, ఆహారం పేగుల ద్వారా త్వరగా కదులుతుంది. ఆహారం వేగంగా, సమర్థవంతంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.