బస్సు ప్రమాద మృతదేహాల అప్పగింత
KRNL: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో 18 మంది మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. DNA నివేదిక ఆధారంగా వీటిని అందజేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు డెత్ సర్టిఫికెట్‌లను కూడా ఇస్తున్నట్లు, కలెక్టర్ సిరి పర్యవేక్షణలో మృతదేహాలు, మృతుల బంధువుల డీఎన్‌ఏ నివేదిక ఆధారంగా అప్పగించనున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అంబులెన్సులు ఏర్పాటు చేశారు.