నూతన చర్చ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు శారదా కాలనీ 17వ లైన్‌లో నిర్మించిన చర్చ్ ప్రారంభ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ ప్రార్థనా మందిరం సంఘసభ్యుల మధ్య ఐక్యత, శాంతి, పరస్పర సహకారానికి నాందిగా నిలుస్తుందని తెలిపారు. ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం ద్వారా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.