రావిపాడు గ్రామస్తులతో సమావేశమైన సీఐ

ప్రకాశం: కంభం మండలం రావిపాడు గ్రామస్థులతో సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహరావు మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు.