ఈనెల 13న గౌరీ పరమేశ్వరుల ఉత్సవం
AKP: మునగపాక మండలం నాగులపల్లిలో ఈనెల 13న గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అచ్యుతాపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గోడపత్రిక ఆవిష్కరించారు. ఉత్సవం సందర్భంగా గౌరీ పరమేశ్వరులను విశేషంగా అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.