రివార్డు పాయింట్ల పేరుతో మెసేజేస్‌తో జాగ్రత్త..!
VKB: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారని బంట్వారం ఎస్సై విమల తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ పాయింట్లను నగదుగా మారుస్తామంటూ వాట్సాప్ MMSల ద్వారా లింకులు పంపి, APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయించి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దని చెప్పారు.