టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
కృష్ణా: మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మహిళలను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మహిళా సంక్షేమానికి టీడీపీ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ నారాయణరావు పాల్గొన్నారు.