అభివృద్థి పనులకు శంకుస్ధాపన చేసిన కార్పొరేటర్
ఖమ్మం నగరంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యక్రమంలో భాగంగా ఇవాళ 9వ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రోటరీ నగర్ కాలినీలో సీసీ రోడ్డు, డ్రైవ్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ జాన్ భీ నాగుల్ మీరా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.