ఆవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత

ఆవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత

RR: గుట్టుచప్పుడు కాకుండా ఓ కంటైనర్‌లో తరలిస్తున్న 32 ఆవులను నందిగామ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాలు.. అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వాహనంలో ఆవులను తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బైపాస్ రహదారిపై వాహనాన్ని తనిఖీ చేసి పట్టుకున్నారు. వాహనంలో ఉన్న మూగజీవాలను నగరంలోని గోశాలకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.