మహాధర్నాకు తరలి వెళ్లిన ఉపాధ్యాయులు

KMM: HYD ఇందిరా పార్కు వద్ద జరిగే ఉపాధ్యాయుల మహా ధర్నాకు శనివారం USPC ఆధ్వర్యంలో ఎర్రుపాలెం, మధిర ప్రభుత్వ ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్య అయిన PRC, DA, CPS రద్దు, 317 భాదిత ఉపాధ్యాయుల సమస్య తదితర డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని TSUTF జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు పేర్కొన్నారు.