CMను కలవనున్న మాజీ ఎమ్మెల్యేల బృందం
W.G: మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ పెంచాలని కోరుతూ.. ఈ నెల 6న అమరావతిలో CM చంద్రబాబును కలవనున్నట్లు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దిగుపాటి రాజగోపాల్ బుధవారం తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మాజీ ఎమ్మెల్యేలకు అందుతున్న సౌకర్యాలను అధ్యయనం చేసి, ఏపీలోనూ అవే వసతులు కల్పించాలని కోరతామన్నారు. ఆచంట మాజీ MLA అయిన రాజగోపాల్ ఈ మేరకు అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేయనున్నారు.