VIDEO: వదంతులతో బంకులకు పోటెత్తిన జనం
KMR: ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందనే సోషల్ మీడియా వదంతులతో బీబీపేట్ మండలంలోని పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. ఒక్కసారిగా జనం రావడంతో కొద్దిసేపట్లోనే పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తగినంత నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల్లో గందరగోళం నెలకొంది.