రేపు తలుపుల మండలంలో పర్యటించనున్న సీఎం

రేపు తలుపుల మండలంలో పర్యటించనున్న సీఎం

సత్యసాయి: సీఎం చంద్రబాబు నాయుడు రేపు కదిరి నియోజకవర్గానికి రానున్న విషయం తెలిసిందే. ఆయన తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లెలో పర్యటిస్తారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గానికి సీఎం రావడం ఇదే తొలిసారి.