జెస్సీరాజ్‌ను భవిష్యత్‌లో మరింతగా ప్రోత్సహిస్తాం: మంత్రి

జెస్సీరాజ్‌ను భవిష్యత్‌లో మరింతగా ప్రోత్సహిస్తాం: మంత్రి

GNTR: దక్షిణ కొరియాలో జరిగిన ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన మంగళగిరి క్రీడాకారిణి జెస్సీరాజ్‌కు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయస్థాయిలో భారత జెండాను ఎగురవేసి గౌరవాన్ని పెంచిందన్నారు. ప్రధాని బాలపురస్కార్ గ్రహీత జెస్సీరాజ్‌ను భవిష్యత్‌లో మరింతగా ప్రోత్సహిస్తామని మంత్రి పేర్కొన్నారు.