రేషన్ షాపు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

రేషన్ షాపు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

NZB: కుర్దూల్‌పేట్ గ్రామంలో నూతన రేషన్ షాపు మంజూరు చేయాలని కోరుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సర్పంచ్ గాండ్ల నవనీత సతీశ్ విన్నవించారు. గ్రామంలో రేషన్ షాపు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు.